విధినిర్వహణతోపాటు క్రమశిక్షణ కూడా అవసరం – యస్.పి రాజేంద్రప్రసాద్
సూర్యాపేట సాక్షిత ప్రతినిధి
జిల్లా ఆర్మ్ డ్ రిజర్వ్ ఫోర్స్ నందు పనిచేస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ లకు రెండు సంవత్సరాల సర్వీస్ కాలం పూర్తయి ప్రోబేషనరి పీరియడ్ కు సంబంధించి జిల్లా పోలీస్ పరేడ్ మైదానం లో యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ ప్రొబేషనర్ టెస్టును నిర్వహించారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ
విధుల నిర్వహణ తోపాటుగా క్రమశిక్షణ చాలా ముఖ్యమని, క్రమశిక్షణతో పనిలో బాధ్యతగా ఉంటే గుర్తింపు లభిస్తుందని తెలిపారు. యస్.పి వెంట
డిసిఆర్బి డిఎస్పి రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, శ్రీనివాస్, గోవిందరావు, నరసింహారావు సిబ్బంది ఉన్నారు.