SAKSHITHA NEWS

శిశు వాటిక తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించిన శ్రీ రామకృష్ణ విద్యాలయం నేటి పోటీ ప్రపంచంలో పిల్లల చదువుల బాధ్యత కేవలం పాఠశాల దే అన్న భావన లో పిల్లల తల్లిదండ్రులు ఉన్న తరుణం లో ప్రతీ విద్యార్థికి మొడటి గురువులు తమ తల్లిదండ్రులే అని గుర్తు చేస్తూ ఇంట్లొ వాళ్ళ భాధ్యత, యే విధముగా వాళ్లు పిల్లలతో సమయము కేటాయించాలి, పిల్లలను యే విధముగా మొబైల్ కు దూరం పెట్టాలి అనే అంశాలతో కలిగిన అవగాహన సదస్సు ఘనం గా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా ప్రముఖ శిశు వైద్యులు డాక్టర్ ఎలమంచిలి నాగమణి విచ్చేశారు. ముఖ్య వక్త గా విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర శిశు వాటిక ప్రముఖ్ కోవెల శ్రీనివాసాచార్యులు వ్యవహరించారు.
నాగమణి మాట్లాడుతూ పిల్లలకు అందించే ఆహారం పట్ల అవగాహన నేటి తల్లిదండ్రులకు ఉండడం ఎంతో అవసరము అని ఇంద్రధనస్సు లోని రంగుల వలే అన్ని కూరలు తినాలి అని పిల్లలను ప్రోత్సహించాలి అని అన్నారు. మాదక ద్రవ్యాల కంటే కూడా ప్రమధమైనది అంతర్జాలం అని దానికి పిల్లలు వ్యసన పరులు కాకుండ చూసుకోవాలి అని అన్నారు. వక్త శ్రీ కోవెల శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఎన్ ఈ పి2020 గురించి వివరించారు. ఈ సదస్సు లో వారు మాట్లాడుతూ ఫౌండేషనల్ స్థాయి పిల్లలలో మనో వికాసం, బుద్ది వికాసం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పిల్లల భౌదిక సామర్ధ్యాల గురించి ఎన్నో విషయాలను వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిల్లల తలిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 21 at 4.55.13 PM

SAKSHITHA NEWS