14వ తేదీ పేట తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
చిలకలూరిపేట :రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సిపిఎం ప్రజా పోరు ప్రచార యాత్ర లో భాగంగా పట్టణంలోని 17వ వార్డు లో ఆదివారం అంకమ్మ చెట్టు వద్ద నుండి చీరాల రోడ్లో రెండు వైపు కరపత్రాలను సిపిఎం కార్యకర్తలు పంపిణీ చేశారు. వెంకట రెడ్డి నగర్, రాచముల నగరం, నేషనల్ కంపెనీ మీదగా పసుమర్రు బ్రిడ్జి వరకు ఇంటింటింకి కరపత్రాలు పంపిణీని చేశారు. సిపిఎం పట్టణ కన్వీనర్ పెరుబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాచుమల్ల నగరు రోడ్డు సైడ్ కాలవలు బాగు చేసి స్తంభాలు వేయాలన్నా రు.నిత్యవసర వస్తువుల రేట్లు తగ్గించాలని మహిళలపై జరిగే దాడులను అరికట్టాలని, 18 రకాల నిత్యవసర వస్తువులు డిపోల ద్వారా ఇవ్వాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, విశాఖ ఉక్కు ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని, వృద్ధా పెన్షన్, కొత్త గా రేషన్ కార్డులు, ఇళ్లస్థలాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కో రుతూ నవంబర్ 14వ తేదీ ఉదయం 10 గంట. చిలకలూరిపేట తాసిల్దార్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్.లూధర్,ఎస్. బాబు, పి. గణేష్ పాల్గొన్నారు.