SAKSHITHA NEWS

సాక్షితహైదరాబాద్‌: తెలంగాణ లో మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల పోలీస్‌ అధికారులతో డీజీపీ ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు.

గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీ విజయ్‌కుమార్‌, అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్‌ ఖాసీంతోపాటు ఇతర అధికారులతో కలిసి డీజీపీ కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రముఖు లు, వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని డీజీపీ సూ చించారు.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్‌ టీంల కదలికలు పెరిగే అవకాశం ఉన్నదని, ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీసుల నిరంతర కృషితో తెలంగాణలో మావోయిస్టులు అంతరించిపోయారని తెలిపారు. రాష్ట్రంలో 80% కొత్తగా విధుల్లో చేరిన పోలీసులు ఉండటం వల్ల మావోయిస్టుల వ్యూహా లు, చర్యలు, దాడులపై మరింత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. పోలీసు ద ళాల కదలికల్లో మార్పులు, వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మారుస్తుండాలని ఆపరేషన్స్‌ అదనపు డీజీపీ విజయ్‌కుమార్‌ సూచించారు. తీవ్రవాద పరిస్థితులు, తీసుకొనే భద్రతా చర్యలను ఐజీ ప్రభాకర్‌రావు వివరించారు.


SAKSHITHA NEWS