గ్రామ సంస్కృతికి ప్రతి బింబం నాభిశిల ఉత్సవం – దేవేందర్ నాయక్

Spread the love

దేవరకొండ సాక్షిత ప్రతినిధి

దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామంలో జరుగుతున్న నాభిశిల ఉత్సవానికి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు ఆహ్వానం మేరకు దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాను యాదవ్, రైతు బంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య లతో కలిసి దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ సంస్కృతికి ప్రతి బింబం నాభిశిల ఉత్సవమని అన్నారు. గ్రామ ప్రజలను సంరక్షించే పొలిమేర దేవతలను ఈ సందర్భంగా పూజించు కోవడం శుభదాయకమని అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతి రూపం నాభిశిల వేల సంవత్సరాలుగా గ్రామ నిర్మాణంలో అత్యంత పవిత్రంగా పూజించే ఆది దేవుడి ప్రతి రూపం నాభిశిలని అన్నారు. అలాంటి నాభిశిల ఇతిహాసాన్ని ఈ తరం తెలుసుకోవాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రావు గ్రామ పెద్దలు, యువజన నాయకులు ఖాదర్ బాబా, ఎనిమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page