అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి,
3 నెలలో స్విమ్మింగ్ పూల్, 2 నెలలో బ్యాడ్మింటన్ కోర్టు పూర్తి…
పెద్దపల్లి పట్టణంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
సాక్షిత పెద్దపల్లి/ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (బాయ్స్) జరుగుతున్న 10వ. తరగతి పరీక్షా కేంద్రాన్ని, ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో నిర్మిస్తున్న ఈత కొలను (స్విమ్మింగ్ పూల్) పనులను, వ్యవసాయ మార్కెట్ లో నిర్మిస్తున్న ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, 10వ తరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశామని, పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఐ.టి.ఐ లో నూతనంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పనులను త్వరగా పూర్తి చేసి 3 నెలలో అందుబాటులో తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో నిర్మిస్తున్న ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు కాంప్లెక్స్ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో ఏఈ నరేష్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY