- ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు సాధ్యం జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ సునీత రెడ్డి
సాక్షిత వనపర్తి
ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు సాధ్యపడుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ముందుగాతెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని ఆకాంక్షించారు.
జిల్లాప్రజలు పండగ వేల సురక్షితంగా, ఆనందంగా పండుగను జరుపుకోవాలని, ముఖ్యంగా రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. పండుగ సందర్భాల్లో అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని, పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధులను మరింత నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ ఉగాది పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఎస్పీ మరోమారు ఆకాంక్షించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY