ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోండి: హౌసింగ్ పీడీ సిద్ధార్థ
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : మండల పరిదిలోని యండ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం హౌసింగ్ పీడీ సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ, నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఇంటి మంజూరు లేదా బిల్లుల విషయంలో ఎవరైనా లంచాలకు పాల్పడితే ఉపేక్ష ఉండదని హెచ్చరించారు.
సూర్యాపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దండి రమేష్ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా అర్హులను గుర్తించి యండ్లపల్లి గ్రామంలో మొత్తం 120 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించామని, ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డి ఈ జబ్బర్ అహ్మద్, ఏఈ రాంబాబు, వర్క్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా, పంచాయితీ కార్యదర్శి విజయకుమారి, పిసిసి ఉపాధ్యక్షులు కుంట్ల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

