లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన బండి రమేష్
*సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే…
*టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్
కూకట్‌పల్లి, సాక్షిత:
సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ అన్నారు. కూకట్‌పల్లి తహసిల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు… కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను నేరుగా చెక్కులు అందజేసి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేశారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం జరిగితే…అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని బండి రమేష్ అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ప్రతినిధిలు, ఆయా శాఖల మంత్రుల ఫొటోలు, అలాగే ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ… ఒక బ్యానర్ ప్రదర్శిస్తూ… సదరు కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత అధికారులపైన ఉందని… అది రాజ్యాంగ పరమైన సూచిక అని బండి రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమం లో నాగిరెడ్డి, పుష్ప రెడ్డి, ప్రవీణ్, కృష్ణ రాజ్పుత్, అరవింద్ రెడ్డి, అప్పారావు, రంగస్వామి, జమీర్, రాజు, శివ చౌదరి, సంధ్య, రజిత తదితరులు పాల్గొన్నారు.

