తోటి విద్యార్థులతో జన్మదిన వేడుకలు జరుపుకోవడం అభినందనీయం.
కరస్పాండెంట్ కందాల ఎల్లారెడ్డి
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: పాఠశాల ప్రాంగణంలో తోటి విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడం అభినందనీయమని విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ కందాల ఎల్లారెడ్డి పేర్కొన్నారు.
సూర్యాపేట మండల పరిధిలోని యండ్లపల్లి గ్రామం విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న టేకుమట్ల గ్రామానికి చెందిన కొరివి సతీష్ యాదవ్, సునితల కుమారుడు వినీత్ యాదవ్ తన నాల్గవ పుట్టినరోజును తోటి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో జరుపుకున్నారు. జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తమ కుమారుడు చదువుతున్న పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి కేకు కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన ఈ జన్మదిన కార్యక్రమంలో కరస్పాండెంట్ కందాల ఎల్లారెడ్డి, ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ… పుట్టినరోజును తోటి విద్యార్థులతో ఆనందంగా జరుపుకోవడం అభినందనీయం. విద్యార్థుల్లో సామూహికత, పాజిటివ్ ఆలోచనలకు ఇది దోహదం చేస్తుంది. వినీత్ యాదవ్ మరెన్నో పుట్టినరోజులు ఆరోగ్యం, ఆనందంతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా వినీత్‌కి ఆశీర్వచనాలు తెలియజేసి భవిష్యత్తులో మంచి ఉన్నత విద్య సాధించాలని ఆశీర్వదించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
