హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి అనూరాధ గారు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని రైతు రుణమాఫీ పొందిన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ తరఫున గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారికి అందించడం జరిగింది…
అనంతరం రుణ మాఫీకి సంబంధించిన వివిధ విధానాలను వ్యవసాయ శాఖ అధికారి ఎమ్మెల్యే నాగరాజు గారికి వివరించడం జరిగింది…
తదనంతరం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) విధివిధానాలను జిల్లా అధికారి గారు ఎమ్మెల్యే నాగరాజు గారికి వివరించడం జరిగింది….