Demolition of poor people's toilets is unfair.
పేదప్రజల మరుగుదొడ్లు కూల్చడం అన్యాయం.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
సాక్షిత : దుందిగల్ గ్రామంలో 5 వ వార్డులో గత 30 సంవత్సరాల క్రితం కట్టిన మరుగుదొడ్లు అధికారులు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో కూల్చడం అన్యాయమని నేడు సీపీఐ నాయకులు కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డ్రైనేజీ,రోడ్డు వేసినప్పుడు లేని ఇబ్బంది అధికారులు హడావిడిగా ఇరుకు రోడ్లని చెప్పి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయ్యడం దారుణమని దీని వెనుకాల స్థానిక బి ఆర్ ఎస్ కౌన్సిలర్ ప్రోద్బలం ఉందని స్థానికులు చెపుదుతున్నారని అలా ఎలా కూల్చివేస్తారని స్థలాని పరిశీలించిన అనంతరం మునిసిపల్ కమిషనర్ ని కలవడం జరిగింది.
కమిషనర్ మాట్లాడుతూ స్థానికులే మాట్లాడి కూల్చివేసుకున్నారని మాకు సంబంధం లేదు అనే విదంగా మాట్లాడారని,సీపీఐ నాయకులు అదే వీధిలో ఇంకా ఇరుకుగా ఉన్న రోడ్ల పై మాత్రం ఉన్న నిర్మాణాలను కూల్చివేయ్యాలదని ప్రశ్నించారు.
వెంటనే వారికి న్యాయం చెయ్యాలని లేకపోతే బాద్యుల పై చర్య తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,సీపీఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావ్,ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, మునిసిపల్ అధ్యక్షుడు రాములు,సీపీఐ నాయకులు ప్రభాకర్,శాఖ కార్యదర్శి భిక్షపతి పాల్గొన్నారు.