SAKSHITHA NEWS

ప్రజాస్వామ్యం పరిణమిల్లాలి
-ఘనంగా కాటా కోటేశ్వరం గ్రామ సభ
-సంవత్సరంలో నాలుగు గ్రామ సభలు
-మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి


సాక్షిత నిడదవోలు, :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆలోచన తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనతి కాలములోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని ఆలోచనతో ఇప్పటికే ఉన్నటువంటి గ్రామ సభలను పునరుద్ధరణచేసి గ్రామ సమస్యలను తెలుసుకొని వారి ఆలోచనలతో సత్వర పరిష్కార దిశగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించుకునేందుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు మండలం కాటా కోటేశ్వరం గ్రామంలో గ్రామ సభకు మంత్రి కందులు దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తొలుత బ్రిటిష్ వారి తుపాకికి గుండెను ఎదురుగా నిలబెట్టి ధైర్యం ఉంటే కాల్చుకోవాలి చాతిని చూపించిన సాహసోపేతమైన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సేవలందించిన ఆంధ్రకేసరి టంగుటూరి వీరేశం పంతులను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఇది మన కర్తవ్యమని పేర్కొన్నారు. 1973-74 రాజ్యాంగ సవరణలో గ్రామ, పట్టణ, నగరాలకు అభివృద్ధి చెందెందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని స్పష్టంగా లెక్కించబడిందన్నారు.


గ్రామానికి అవసరమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలో స్వయంగా గ్రామస్తులే తెలియజేయడం వలన గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల రూపకల్పనకు గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాల్సిన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అధికారులు అనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా గ్రామ సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. గ్రామసభల్లో గ్రామ సమస్యలను క్షేత్రస్థాయిలోని స్థానిక గ్రామ ప్రజలు నిర్ణయించగా, ప్రభుత్వం అమలు చేసే దిశగా చర్యలు ఏర్పడుతుందన్నారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అమలు చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంతో పాటు రాష్ట్రంలోని గ్రామాల్లో గ్రామ సభలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మంత్రి పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రు. 11 కోట్ల నిధులు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేయడం జరిగిందన్నారు. కాట కోటీశ్వరం గ్రామంలో సుమారు రు. 25 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టుకున్నామన్నారు.

రాబోయే రోజుల్లో గ్రామాలు అభివృద్ధికి ప్రభుత్వ మంజూరు చేసిన కార్యక్రమాలకి ప్రజల భాగస్వామ్యం తోడైతే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి గ్రామంలో రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ కచ్చితంగా ఉంటే ఆ రహదారి ఎక్కువ కాలం మన్నుతుందని ఆ దిశగా డ్రైనేజీ వ్యవస్థను ప్రటిష్ట పరిచేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సంవత్సరానికి నాలుగు పర్యాయాలు గ్రామసభలను ఏర్పాటు చేసుకొని తద్వారా గ్రామ సభలు పరిష్కరించుకునేందుకు నిధులు సహకరించుకుందామన్నారు.
గత ప్రభుత్వం రైతులకు ధాన్యానికి సంబంధించిన సొమ్మును చెల్లించకుండా విస్మరిస్తే నేడుకూటమి ప్రభుత్వం రైతులకు రు. 1600 కోట్లను చెల్లించిందని, పెన్షన్ పెంచడం, ధరల స్థిరికరణ వంటి అంశాలపై దృష్టి సారించడం జరిగిందన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జనవరి 26 గణతంత్ర దినోత్సవ రోజున, మే 1 కార్మికుల దినోత్సవం రోజున, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున, అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున నాలుగు గ్రామ సభలు నిర్వహించుకుని, గ్రామాలలో మౌలిక సదుపాయాలు, అవసరాలు, వనరులు, సమస్యలపై గ్రామస్థులతో కలిసి చేర్చేందుకు వేదికగా నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గ్రామ ప్రజల హక్కులు బాధ్యతలు తెలుసుకునేందుకు చక్కటి వేదిక గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గ్రామ సభలు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకి తెలియాలి, ముఖ్యంగా గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేలా అవగాహాన కలుగ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. మన గ్రామం అభివృద్ది కోసం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, రహదారుల నిర్మాణం, త్రాగునీటి వ్యవస్థ, తదితర అంశాలపై చర్చించడానికి గ్రామ సేవలు నిర్వహించు కోవడం జరుగుతోందని తెలిపారు. గ్రామ సభకు అర్హత కలిగిన 10 శాతం మంది ప్రజలు గాని గ్రామంలోని 50 మంది వ్యక్తులు గాని గ్రామ సభ నిర్వహించిన అక్కడ గ్రామ సభ నిర్వహించిన అవకాశం ఉందన్నారు. ఈ టవల్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చిన గొప్ప ఆలోచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా …

WhatsApp Image 2024 08 23 at 17.05.16

SAKSHITHA NEWS