సిద్ధిపేట టూ షోలాపూర్‌కు డీలక్స్ బస్సు సర్వీస్ ప్రారంభం

Spread the love

సిద్ధిపేట నుంచి 5 డీలక్స్ బస్సులు వచ్చే వారం, పది రోజుల్లో ప్రారంభిస్తాం.
జెండా ఊపి సిద్ధిపేట టూ షోలాపూర్‌కు డీలక్స్ బస్సులు ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు


సాక్షితసిద్ధిపేట : పెరుగుతున్న అవసరాలు, ప్రజా సౌకర్యార్థం ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేర వేయడంతో పాటు రద్దీకి అణుగుణంగా నూతన డీలక్స్ సర్వీస్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
షోలాపూర్‌కు వెళ్లే ప్రయాణీకులు అందరూ అధునాతన బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుని, మీరు మరింత సౌకర్యవంతమైన, తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకునే బస్సులో ప్రయాణించి ప్రయాణ అనుభూతిని పొందాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో సిద్ధిపేట నుంచి షోలాపూర్‌ వరకు మూడు నూతన డీలక్స్ సర్వీసు బస్సులను బుధవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా సిద్ధిపేట డిపో ఆర్టీసీ బస్సులను ఆదరిస్తూ డిపో ఆదాయాన్ని, దాని ద్వారా ఆర్టీసీ సంస్థ ఆదాయం పెరగడానికి సహకరిస్తున్న ప్రయాణీకులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

సిద్ధిపేట నుంచి 5 డీలక్స్ బస్సులు వచ్చే వారం, పది రోజుల్లో ప్రారంభిస్తామని, సిద్ధిపేట నుంచి ఐదు డీలక్స్ బస్సులు హైదరాబాదు, సికింద్రాబాద్, సిద్ధిపేట మీదుగా నడపనున్నట్లు, రాబోయే రోజుల్లో గొందియాకు కూడా డీలక్స్ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్, జహీరాబాద్, ఉమ్నాబాద్, ఉమర్గ, నల్ దుర్గ్ మీదుగా షోలాపూర్‌కు
బస్సులు బయలుదేరతాయని, అధునాతన సౌకర్యాలతో కూడిన ఫుష్ బ్యాక్ సీట్లతో కూడిన మూడు నూతన డీలక్స్ సర్వీస్ బస్సులు సిద్ధిపేట నుంచి ప్ర‌తి రోజు ఉదయం 6.30 గంటలకు, అలాగే సాయంత్రం 6.20 గంటలకు
షోలాపూర్‌కు బయలు దేరుతాయని, అదే విధంగా
షోలాపూర్‌ నుంచి సిద్ధిపేటకు ఉదయం 7.30 గంటలకు అలాగే రాత్రి 10 గంటలకు బయలుదేరతాయని మంత్రి వివరించారు. అదే విధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు జేబీఎస్ కు డీలక్స్ బస్సు సౌకర్యం అందుబాటులో ఉన్నదని, కాబట్టి షోలాపూర్‌కు వెళ్లే ప్రయాణీకులు అందరూ ఈ అధునాతన బస్సు సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
షోలాపూర్‌కు వెళ్లే బస్సులు tsrtconline.in ఆన్ లైను ద్వారా వెబ్ సైటులో టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉన్నదని సిద్ధిపేట ఆర్టీసీ డిపో వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఆర్టీసీ ఆర్ఏం సుదర్శన్, సిద్ధిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page