బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని 8,9వ తరగతులకు పాఠ్యాంశంగా చేర్చిన ఢిల్లీ సర్కార్.
పాఠ్య ప్రణాళికలో అంబేద్కర్ జీవితం ప్రత్యేక పుస్తకాన్ని ప్రవేశ పెట్టిన ఢిల్లీ ప్రభుత్వం శభాష్… అరవింద్ క్రేజీవాల్
డాక్టర్ అంబేద్కర్ 61వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని విడుదల చేస్తూ, ప్రైవేటు పాఠశాలలు కూడా ఈ పుస్తకాన్ని వాటి పాఠ్య ప్రణాళికలో చేరుస్తాయన్న విశ్వాసాన్ని ముఖ్యమంత్రి అర వింద్ కేజీవాల్ వ్యక్తం చేశారు. ‘అంబేద్కర్ను కేవలం దళితుల నేతగా అభివర్ణించడం ద్వారా ఆయన సమాజానికి చేసిన కృషిని తగ్గించి చూపారు’ అని కేజీవాల్ ఈ సందర్భంగా అన్నారు. ‘ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీఐ) ఏర్పాటు కావడంలో, హిందూ కోడ్ బిల్లులో మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో, రైతుల సంక్షేమానికి పాటుపడటంలో అంబేద్కర్ సలిపిన కృషి కొంతమందికి మాత్రమే తెలుసు.. మా పిల్లల్లో ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తెలియజేయాలని కోరుకుం టున్నాం’ అని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారతను ఐక్యం చేయడానికి కృషి చేయగా, బాబా సాహెబ్ అంబేద్కర్ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి రాజ్యాంగాన్ని రచించారని ఆయన అన్నారు.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం, ఆయన చేసిన కృషిపై రచించిన ఒక చిన్న పుస్తకాన్ని శుక్రవారం ఆరో తరగతి, ఎనిమిదో తరగతి విద్యార్ధుల పాఠ్య ప్రణాళికలో చేర్చింది.
దేశం మొత్తం పాలించిన నాయకులు చేయని పని ఒక ముఖ్యమంత్రి చేశాడు… అది చదువుకున్న వాడికి చదువుకోని వాడికి ఉన్న తేడా