తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులుగా డా,, మౌటం కుమారస్వామి నియామకం
కమలాపూర్ సాక్షిత న్యూస్ ( సెప్టెంబర్ 1 )
ముదిరాజ్ మహాసభ హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా కమలాపూర్ గ్రామానికి చెందిన డా.మౌటం కుమారస్వామి ముదిరాజ్ ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. రావుల జగదీశ్వర్ ప్రసాద్ నియామక ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్బంగా డా. జగదీశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ ముదిరాజ్ జాతి సమస్యల పై పోరాడాలని జాతి సంక్షేమానికి కృషి చేయాలని అయన అన్నారు. కమలాపూర్ గ్రామానికి చెందిన మౌటం కుమారస్వామి గతంలో కమలాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా కమలాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులుగా మరియు గౌరవ అధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ గా జిల్లా ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా పని చేశారని కమలాపూర్ నియోజకవర్గ ముదిరాజ్ మహాసభ ఇంచార్జ్ గా కూడా పని చేశారని ఆయన అన్నారు.కాకతీయ యూనివర్సిటీ లో పీహెచ్డీ పూర్తి చేసి మత్స్యకారుల సమస్యల పై చేపల ఉత్పత్తి పై అనేక పరిశోదనా వ్యాసాలు, జాతీయ అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితం చేసిన వ్యక్తి మౌటం కుమారస్వామీ అని ఆయన కొనియాడారు. ఈ సందర్బంగా డా. మౌటం కుమారస్వామి మాట్లాడుతూ నా పై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా,,రావుల జగదీశ్వర్ ప్రసాద్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక పై ముదిరాజ్ జాతి శ్రేయస్సుకు పాటుపడుతానని బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చే ఉద్యమం లో క్రియా శీలకంగా పాల్గొని ముదిరాజ్ జాతి మొత్తం ఏకం చేస్తానని ఆయన పేర్కొన్నారు.