దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని ముఖ్య అతిథులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి లబ్ధిదారులకు అందజేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .
: *సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్ : * తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా రాజీవ్ గృహకల్పలో నివాసితులైన ఘణపురం రవీందర్ కుటుంబ సభ్యులకు దళిత బంధు ద్వారా మంజూరు అయినా షిఫ్ట్ డిజైర్ కార్ ను ముఖ్య అతిథులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి దళిత బంధు లబ్ధిదారులకు మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ ను అందజేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆర్థికంగా బలోపేతం కావాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో భాగంగా పక్కా ప్రణాళికతో యూనిట్లను నెలకొల్పి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, ఈ పథకంను సద్వినియోగపర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పేదవారి కోసం ఇటువంటి సంక్షేమ పథకాలు లేవు అని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో అన్నిరంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యం అని అన్నారు. ఎంపికైనటువంటి లబ్ధిదారులు దళిత బంధు పథకాన్ని ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఆదాయ వనరుగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళిత బంధు పథకం కింద మారుతి షిఫ్ట్ డిజైర్ కారును పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ కారు ఓనర్ గా మారిన సందర్భంగా స్వీట్లు పంచుతూ, హర్షం వ్యక్తం చేస్తూ, మాకు దళిత బంధువుతో జీవనోపాధిని కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి, మంత్రి కేటీఆర్ కి, ఎమ్మెల్యే గాంధీ కి, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్ లింగాయత్, చిన్నం రాజ్,యాదగిరి, రమేష్, దేవేందర్ దళిత బంధు లబ్ధిదారులు ఘణపురం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని ముఖ్య అతిథులుగా పూజా కార్యక్రమాలు
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…