SAKSHITHA NEWS

4

ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో స్వయంగా కలియతిరిగిన సీపీ

వర్షం రద్దీ దృష్ట్యా.. ప్రజలను అప్రమత్తం చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

-ప్రజలు సిబ్బందిని అధికారులను సమన్వయం చేస్తూ ఫీల్డ్ లో సీపీ

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., మాదాపూర్ డిసిపి సందీప్, ఏడీసీపీ రవికుమార్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసిపి రణవీర్ రెడ్డి, మియాపూర్ ఏసిపి నరసింహారావు, చందానగర్ ఇన్ స్పెక్టర్ పాలవెల్లి, మియాపూర్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ఇతర ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి ముందుగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న వాటర్ లాగిన్ ఏరియాని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

సీపీ ఆయా ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రస్తుత వాస్తవ పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ జాగ్రత్తలు తెలిపారు.

ట్రాఫిక్ సిబ్బంది అంతా ఫీల్డ్ లోనే ప్రజలకు ఉన్నారని, ఎటువంటి సమస్యా రాకుండా విధులు నిర్వర్తిస్తున్నారాన్నారు.

వర్షంలో వాహనదారులకు ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాలు ముందుకు సాగేలా పోలీస్ అధికారులు పని చేస్తున్నారన్నారు.

ఐఎండి వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు ఉన్న కారణంగా ఐటీ ఉద్యోగులను మూడు షిఫ్టులవారీగా పంపించేందుకు ఇప్పటికే కంపెనీలతో మాట్లాడా మన్నారు. ఇది మరో రెండు వారాలు కొనసాగిస్తున్నామన్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, అనవసరంగా బయటకు రావద్దన్నారు.

ప్రజలు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని, పోలీసు, GHMC వారి సూచనలను పాటించాలన్నారు.

బాలానగర్ జోన్ లో..

సిపి బాలానగర్ జోన్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న బాలాజీ లేఔట్ లోని ఓ లే అవుట్ లో వద్ద ఉన్న వాటర్ లాగిన్ ఏరియాలను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు.

జిహెచ్ఎంసి సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. సిపి వెంట బాలానగర్ డిసిపి శ్రీనివాసరావు, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ – II డీవీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఏసిపి గంగారాం,  జీడిమెట్ల ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పవన్, జీడిమెట్ల ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS