ఫింగర్ ప్రింట్ & క్లూస్ టీమ్ పై సైబరాబాద్ సీపీ సమీక్ష

SAKSHITHA NEWS

సాక్షిత : ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి సీపీ రివార్డులు
ఫింగర్ ప్రింట్ యూనిట్ & క్లూస్ టీమ్ సిబ్బంది తో సైబరాబాద్ సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం లో సీపీ తో పాటు సైబరాబాద్ డిసిపి క్రైమ్స్ కల్మేశ్వర్ సింగెన్వర్, ఐపిఎస్., అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ FSL & హైదరాబాద్ క్లూస్ టీమ్ HOD వెంకన్న మరియు సిబ్బంది ఉన్నారు.
ఈ సమావేశం లో సీపీ మాట్లాడుతూ… ఇప్పటివరకూ ఉన్న మాదాపూర్, శంషాబాద్ మరియు బాలానగర్ జోన్ల కు అదనంగా కొత్తగా ఏర్పాటైనటువంటి లా& ఆర్డర్ రాజేంద్రనగర్, మేడ్చల్ జోన్ల లోనూ ఫింగర్ ప్రింట్ & క్లూస్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు. జోన్ల వారీగా ఫింగర్ ప్రింట్ యూనిట్లు, డివిజన్ల వారీగా క్లూస్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు.

త్వరలోనే ఒక రిటైర్డ్ ఫొరెన్సిక్ ఎక్స్పెర్ట్ అధ్వర్యంలో ఒక సెంట్రలైజెడ్ క్లూస్ టీమ్ హెడ్ ఆఫీసు ను ఏర్పాటు చేయనున్నామన్నారు.

నేరం జరిగిన ప్రదేశం నుండి శాస్త్రీయ ఆధారాల సేకరణలో నాణ్యతను మెరుగుపరచడం కోసం క్లూస్ మరియు ఫింగర్ ప్రింట్ యూనిట్లను పటిష్టం చేశామన్నారు.

శాస్త్రీయ దర్యాప్తులో సహాయపడటానికి కీలకమైన ఆధారాలను భద్రపరచడానికి మరియు సేకరించడానికి, నిందితులకు శిక్షను నిర్ధారించడానికి వేగంగా సంఘటన స్థలానికి చేరుకోవాలన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ FSL & హైదరాబాద్ క్లూస్ టీమ్ HOD వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బంది కి వారి పనితీరులో వర్క్ మానిటరింగ్, క్వాలిటీ ఎన్శూరింగ్, అకౌంటబిలిటీ పై అవగాహన కల్పించారు.

నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాల సేకరణలో నూతన సాంకేతిక పద్ధతులను అవలంభించాలన్నారు.తద్వారా సంక్లిష్ట మైన కేసుల దర్యాప్తు వేగవంతమవుతుందన్నారు.

ఈ సందర్భంగా కేసుల చేధనలో ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి సీపీ రివార్డులు అందజేశారు.
ఈ సమావేశంలో సీపీ తో పాటు సైబరాబాద్ డిసిపి క్రైమ్స్ కల్మేశ్వర్ సింగెన్వర్, ఐపిఎస్., అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ FSL & హైదరాబాద్ క్లూస్ టీమ్ HOD వెంకన్న, అన్ని డివిజన్ల ఏసీపీలు, ఫింగర్ ప్రింట్ యూనిట్ & క్లూస్ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page