SAKSHITHA NEWS

కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు…
సాక్షిత ప్రతినిధి కోదాడసూర్యాపేటజిల్లా) కోదాడ పట్టణంలో కత్రం చారిటబుల్ ట్రస్ట్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలో నిర్వహిస్తున్నారు.కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చందర్రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కథనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషకరమైన విషయం అన్నారు. క్రీడలు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక శక్తికి మంచిది అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు గారు యూత్ అధ్యక్షుడు డేగ శ్రీధర్, మాజీ సర్పంచులు బాబు ,సత్తిబాబు , పార సీతయ్య, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు ముడియాల సత్యనారాయణరెడ్డి, బాబి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS