ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి – సిపిఎం నాయకులు జిట్ట నగేష్
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
ప్రాథమిక పరపతి సహకార సంఘాలు( పిఏసీయస్),ఐకేపి ధాన్యం కొనుగోలు సెంటర్ లలో జరుగుతున్న అవకతవకలను సరిచేసి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీ శైలం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. చిట్యాల మండలం చిన్న కాపర్తి, తాళ్ళవెల్లంల, ఉరుమడ్ల, ఆరెగూడెం తదితర గ్రామాలలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం నాడు పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం కొరకు భూమి లీజు పేరుతో ప్రతి రైతు వద్ద క్వింటాలుకు ఒక్క రూపాయి చొప్పున వసూలు చేయటం విచారకరమని అన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని లారీ ఎగుమతి చేసి రైస్ మిల్లుకు పంపిస్తే లారీ ఊడ్చడానికి రూ. 200 రూ.ల చొప్పున రైతుల వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు కొత్త బార్థాన్ గోనె సంచులు సరఫరా చేయకపోవడం వల్ల పాత బస్తాలకు రంధ్రాలు పడి వడ్లు రాలిపోతున్నాయనే కారణాలతో బస్తా కు 50 గ్రాముల నుండి 150 గ్రాముల వరకు ధాన్యం అదనంగా తూకం వేయటం వల్ల రైతులందరూ నష్ట పోతున్నారని అన్నారు. ఈ విషయం లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతుల సమస్యలు పరిష్కరించాలని డి.యస్. ఓ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ రుద్రారపుస బిక్షం లను కోరారు. సమస్య లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వెలుదామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహ, మాజీ జడ్ పీ టీ సీ మెంబరు పామనుగుల్ల అచ్చాలు, సిపిఎం మండల నాయకులు మెట్టు నర్సింహ, నకిరేకంటి రాములు, కోనేటి రాములు, వివిధ ప్రజా సంఘాల నాయకులు లోడె విఘ్ణమూర్తి, ఇద్దయ్య, హనుమయ్య, దశరథ, యాదయ్య, గోపాల్, బెలిజ మల్లయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.