SAKSHITHA NEWS

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సిపిఐ,ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకుల నివాళులు.

  భారత దేశ మాజీ ప్రధాని ఆర్థిక నిపుణులు మన్మోహన్ సింగ్ మృతికి నేడు జగత్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
   దేశం ఆర్థిక నష్టాలో ఉన్నపుడు  ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని,యూ పి ఏ హయాంలో సుమారు 3 కోట్ల రైతులకు ఉపయోగపడేలా రైతు రుణమాపీ దేశవ్యాప్తంగా అమలుచేసిన గొప్ప వ్యక్తని,గ్రామీణ రైతులకు 100 రోజుల గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చి ప్రజలకు ఆర్థిక స్వావలాంబన కల్పించి,ప్రజలకు సమాచార హక్కు , విద్య హక్కు చట్టం, ప్రధానిగా ఉన్నన్ని రోజులు ఒక రూపాయి మాత్రమే జీతం తీసుకొన్న గొప్ప వ్యక్తని అలాంటి వారిని కోల్పోవడం యావత్తు భారత దేశానికి నష్టామన్నారు.

వారికి సిపిఐ గా, ఏ ఐ ఎస్ ఎఫ్ గా వారి కుటుంబానికి సంతాపం ప్రకటిస్తునామని అన్నారు.

   ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, కార్యవర్గ సభ్యులు హరినాథ్,  సహాయ కార్యదర్శి దుర్గయ్య, ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు అరవింద్,శివ,భువన్, మధు, సీనియర్  జర్నలిస్టు రామస్వామి,ఆర్ పి కాలనీ అధ్యక్షుడు భాస్కర్,ఇమామ్, ప్రభాకర్,శాంతమ్మ లు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS