చలో కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలి – సీపీఐ
నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న తేదీన జరిగే ధర్నా జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నకిరేకల్ నియోజకవర్గ కార్యదర్శి దుబ్బ విగ్నేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇంటి ఇంటి స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి 6 లక్షల ఇవ్వాలని ఇల్లు స్థలాలు లేనివారికి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారికి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఉపాధి హామీ కూలీలకు రోజువారి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని ఎండలో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు టెంటు సౌకర్యం కల్పించాలని పారాగడ్డపారలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పై సమస్యలు పరిష్కారానికి ఈనెల 10న జరిగే ధర్నా కార్యక్రమాన్ని మండలాల్లోని ఉపాధి హామీ కార్మికులు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.