బాబాసాహెబ్ అంబెడ్కర్ వర్థంతి సందర్భంగా నేడు జగతగిరిగుట్ట ఔటపోస్టు వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి నేడు దళిత హక్కుల సమితి అధ్యక్షుడు దుర్గయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, రాష్ట్ర నాయకులు ఏసురత్నం పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తా అన్న కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా ఓడించడం జరిగిందని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన స్పూర్తితో రానున్న రోజుల్లో నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పేదలకు కాకుండా కబ్జాదారులకు సహకరించిన అధికారులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూ,ప్రభుత్వ భూములు కాపాడుకుంటామని ,పేద ప్రజల కోసం మరో బూపోరాటం నిర్వహిస్తామని అన్నారు. నియోజకవర్గ పరిధిలో పెన్షన్లు లేనివారికి,అర్హులైన వారికి రేషకార్డులను అందించడానికి పోరాటం నిర్వహిస్తామని అన్నారు.
అధికారులు ఇప్పటికైనా భూకబ్జాదారులకు సహకరించకుండా కబ్జాలను వెంటనే తొలగించాలని లేకపోతే అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష,జిల్లా కార్యదర్శి హరినాథ్, శ్రీనివాస్,నాయకులు సహదేవ్ రెడ్డి, చిగురు వెంకటేష్ రాజు,నర్సింహ,ప్రభాకర్,నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించే హక్కును కల్పించిన మహానుభావుడు అంబెడ్కర్.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…