సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
సాక్షిత : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీలో రోడ్డు నెంబర్ 4 లో పదిహేడు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, రాజేష్ చంద్ర, వీరస్వామి జ్యోతిబా, సాయి, కోటేశ్వరరావు, రామయ్య చౌదరి, బాలు, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును
SAKSHITHA NEWS సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి తాయప్ప S/o నాగప్ప కి చికిత్స నిమిత్తం సీఎం సహాయం నిధి 26,000 గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి…
తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి
SAKSHITHA NEWS తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి న్యూఢిల్లి: తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) కన్వీనర్‌గా సీనియర్ ఎంపీ మల్లు రవిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా సీపీపీ కన్వీనర్లను నియమించారు. కాంగ్రెస్…