సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
సాక్షిత : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ కాలనీలో రోడ్డు నెంబర్ 4 లో పదిహేడు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, రాజేష్ చంద్ర, వీరస్వామి జ్యోతిబా, సాయి, కోటేశ్వరరావు, రామయ్య చౌదరి, బాలు, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ
SAKSHITHA NEWS శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న కమిటీ సభ్యులు… మల్కాజిగిరి దసరా నవరాత్రుల్లో భాగంగా సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ కట్ట మైసమ్మ ఆలయంలో…
యతీ నరసింహనంద్ సరస్వతి పై ఎసిపి కి ఫిర్యాదు…
SAKSHITHA NEWS యతీ నరసింహనంద్ సరస్వతి పై ఎసిపి కి ఫిర్యాదు… -అడ్వకేట్ సాదిక్ షేక్సమ్మన్ ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షుడు సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి & న్యాయ్… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత; సెప్టెంబర్ 29…