SAKSHITHA NEWS

సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ లో నలభై లక్షల రూపాయల నిధులతో నిర్మాణ పనులు పూర్తయిన నూతన సీసీ రోడ్డును డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా అంచుల వద్ద మట్టి వేయాలని, అలాగే మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టి కాలనీని పచ్చని వనంలా సుందరంగా మార్చుకోవాలని కాలనీ వాసులకు తెలిపారు. సీసీ రోడ్డు నిర్మించిన కార్పొరేటర్ గారిని కాలనీ వాసులు సన్మానించి కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, యాదగిరి, అగ్రవాసు, సంగమేష్, రవీందర్, అజామ్, బుజమ్మ, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS