124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ కాలనీ ఫేస్ 2 వాంబే బ్లాక్ నెంబర్ 50,51,52,53 వద్ద సీసీ రోడ్ల కొరకు గతంలో పది లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయిన రెండు గల్లీలలోని సీసీ రోడ్డును డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా అంచుల వద్ద మట్టి వేయాలని, అలాగే మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. నూతన సీసీ రోడ్లు నిర్మించినందుకు కాలనీ వాసులందరు హర్షం వ్యక్తం చేసి కార్పొరేటర్ ని శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, సయ్యద్, యాదగిరి, కె.శ్రీనివాస్, బాలస్వామి, బాబు నాయక్, జనార్దన్, ఫారూఖ్, ఖలీమ్, రవీందర్, బాలస్వామి సాగర్, సన్యాసిరావు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…