SAKSHITHA NEWS

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ని మర్యాద పూర్వకంగా కలిసి తమ బస్తీలో నెలకొన్నటువంటి విద్యుత్తు దీపాల సమస్య మరియు సిసి రోడ్డు సమస్యలు అలాగే నూతనంగా బంచ్ కేబుల్స్, అమర్చాలని శ్రీ అభయాంజనేయ దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ని షిఫ్ట్ చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శివాజీ నగర్ బస్తీలో నెలకొన్న సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చినటువంటి సమస్యలను * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు* దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యలకు పరిష్కారం చూపుతామని కార్పొరేటర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్లం, ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.