ఘనంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు.
వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు కార్యకర్తలు డివిజన్ వాసులు.
హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు హైదర్ నగర్ డివిజన్ సమత నగర్ కాలనీ లోని వార్డు కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ , హైదర్ నగర్ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొని కేక్స్ కట్ చేయించి బోకెలతో, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. చర్చ్ పాస్టర్లు అందరూ కలసి నార్నె శ్రీనివాస రావు కొరకు ప్రార్థనలు చేశారు. అలానే వేద పండితులు ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
