పల్లె పాటకు ప్రాణం పోసిన గాయకుడు సాయి చంద్…………….సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
సాక్షిత వనపర్తి :
ప్రముఖ గాయకుడు సాయిచంద్ వర్ధంతి ప్రభుత్వ ఆసుపత్రిలో బండారు శ్రీనివాస్ అధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుసశంకర్ గౌడ్ మాట్లాడుతూ
పల్లె పాటకు ప్రాణం పోసిన గాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ సాయి చంద్ అన్నారు.
“ఊరు మనదిరా ఈ వాడ మనదిరా” అంటూ ఉర్రూతలూగించిన స్వరం సాయి చంద్
ఆయన పాట వింటే రైతు నాగలి పట్టుకున్నా నాట్యం చేస్తాడు.
తెలంగాణ ఉద్యమంలో ఆయన గొంతు ఒక ఆయుధమైంది అన్నారు.
“జయ జయహే తెలంగాణ” అంటూ లక్షల గొంతుకలకు స్ఫూర్తినిచ్చారు.
బతుకమ్మ, బోనాలు, జాతర – ప్రతి పండక్కి సాయి చంద్ పాట ఉండాల్సిందే.
ఆయన స్వరంలో పల్లె సొగసు, మట్టి వాసన, అమ్మ ప్రేమ కనిపిస్తాయి అన్నారు.
సినిమా పాటలైనా, జానపదాలైనా – ప్రతి పాటలో జీవం ఉంటుంది.”రేలా రేలా రే” అంటూ యువతను ఉరికించిన గాయకుడు.
తెలంగాణ యాసను, భాషను ప్రపంచానికి పరిచయం చేసిన కళాకారుడు సాయి చంద్ అన్నారు.
వందలాది పాటలు, వేలాది స్టేజ్ షోలు – అలుపెరగని ప్రయాణం.ప్రముఖ కవి జనజ్వాల మాట్లాడుతు
కళాకారుడిగానే కాకుండా మంచి మనిషిగా అందరి మనసులు గెలిచారు.
నిరాడంబరతకు, వినయానికి మారుపేరు సాయి చంద్.
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, పాట రూపంలో బ్రతికే ఉన్నారు.
ప్రతి తెలంగాణ ఇంట్లో ఆయన పాట మారుమోగుతూనే ఉంటుంది.మహానేయుల స్పూర్తి వేదిక కన్వీనర్ గంధం నాగరాజు మట్లడుతు
సాయి చంద్ అనే పేరు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
ఆ మహా గాయకుడి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి చందు మూడవ వర్ధంతి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ముఖ్య అతిథులు గా పాల్గొనాడం జరిగినది. ఈ కార్యక్రమంలో డా! బండారు శ్రీనివాస్, కవి రచయిత జనజ్వాల, సామాజికవేత గంధం నాగరాజు , ఇబ్రహీం , సానా బేగం, కృష్ణయ్య, మమత, కాసిం, అల్లిబాబు, పద్మ రామకృష్ణ మరియు వైద్య ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
