పెబ్బేరు పశువుల సంత, పోలీస్ చెక్ పోస్టును తనిఖీ చేసిన …….అదనపు ఎస్పీ రాజేష్ మీనా
సాక్షిత వనపర్తి :
జిల్లా నుండి పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు జిల్లా అదనపు ఎస్పి రాజేష్ మీనన్ ఆదేశించారు పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి శనివారం భారీ స్థాయిలో నిర్వహించే పెబ్బేరు పశువుల సంతను అనంతరం జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్ ను ఆకస్మికంగా అదనపు ఎస్పీ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల రవాణా చేసే వ్యక్తుల వద్ద తప్పనిసరిగా వెటర్నరీ అధికారుల అనుమతి పత్రాలు ఉన్నాయో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు
చెక్ పోస్ట్ లో విధులు నిర్వహించే సిబ్బంది షిఫ్ట్ల వారిగా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని విధుల్లో అలసత్వం ప్రదర్శించే రాదని తనిఖీ చేసిన ప్రతి వాహనం వివరాలు రిజిస్టర్లు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు అదేవిధంగా విధుల్లో ఉన్న సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశించారు పోలీసులు చేపట్టే కార్యక్రమం అయినా ప్రజల సహకారంతోనే విజయవంతం అవుతుందని పశువుల అక్రమ రవాణా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అదనపు ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వారి వెంట కొత్తకోట సిఐ రాంబాబు పెబ్బేర్ ఎస్ఐ వెంకటేష్ గౌడ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

