సాక్షిత ప్రకాశం జిల్లా
యర్రగొండపాలెం
✍️నియోజకవర్గంలో ఐదు మండలాల కన్వీనర్లు పూర్తి గా విపలం..
✍️ఐదు కన్వీనర్ల పదవులు,మూడు జిల్లా పదవులు ఉన్న పార్టీ కి ఉపయోగం శూన్యం…
✍️జనసేన ను జనంలో లేకుండా చేస్తున్నా కన్వీనర్లు,అంత మా ఇష్టం అంటున్న కింది స్థాయి నాయకులు..
✍️65 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ, మైనారిటీల ను కలుపుకోనిపోని నాయకులు..
✍️ఇలానే కొనసాగితే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం..
✍️కొన్ని మండలాల్లో పార్టీ బలంగా ఉన్న వారిని పార్టీ వైపు తీసుకురాలేకపోతున్న వైనం…
✍️ప్రజల సమస్యల పై పార్టీ తరఫున ఇంచార్జి గౌతమ్ రాజు నిరంతర పోరాటం..
✍️ పార్టీ బ్రతకాలి అంటే అందరిని కలుపుకోనిపోయో నాయకులు కావాలి:కార్యకర్తలు
✍️యర్రగొండపాలెం నియోజకవర్గం పై అధినాయకత్వం దృష్టి సారించాలి..
జనం కోసం జనసేన అని భావితరాల భవిష్యత్తు కోసం పార్టీని స్థాపించామని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల తరఫున నిలబడే పార్టీ అని గొప్పలు చెప్పుకునే అధినాయకత్వం.ఆచరణలో మాత్రం అది కనిపించడం లేదు.ముఖ్యంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం పార్టీ కి అండగా నిలిచిన వాటిని ఓట్ల రూపంలో మార్చుకోలేక పోతున్నారు.గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వనప్పటికి ఎమ్మెల్యేగా నిలబడిన గౌతమ్ రాజు మాత్రం పార్టీ తరఫున ప్రజలలో ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.కానీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కిందిస్థాయి నాయకులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను బీసీ మైనార్టీలను కలుపుకోకుండా వారికి తోచిన విధంగా చేస్తుండడంతో నియోజకవర్గ జనసేన కార్యకర్తల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల లో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఐదు మండలాలకు కన్వీనర్లు గాను జిల్లా లో మూడు పదవులను ఆవర్గానికే కేటాయించిన వారు మాత్రం ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవటం లేదని స్థానిక జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
✍️పార్టీ కి పనికి రాని కింది స్థాయి నాయకులు…
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కన్వీనర్లు గా ఉన్నటువంటి నాయకులు 65 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ లను ఏమాత్రం కలుపుకొని పోకుండా ఒంటెద్దు పోకడల ఉన్నారని కార్యకర్తలు వాపోతున్నారు.ప్రతి మండలంలో కన్వీనర్లుగా ఉండి కూడా ప్రజలను కలుపుకోకుండా ఉండటం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.నియోజకవర్గ ఇంచార్జి పాకనాటి గౌతమ్ రాజు ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన పార్టీ నాయకులు వారి ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు అనేక విమర్శించలకు దారితీస్తుంది.
వార్త సేకరణ : నీలం రమేష్ బాబు