SAKSHITHA NEWS

పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ 1 2024 జగిత్యాల జిల్లా కంట్రిబ్యూటరి పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి…*
-తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ జగిత్యాల జిల్లా చేర్మన్ భోగ శశిధర్, సెక్రెటరి జనరల్ గంగుల సంతోష్ కుమార్….
-సిపిఎస్ ను అంతం చేసే వరకు ఉద్యోగుల పోరాటం ఆగదు
-గళమెత్తి గర్జించిన ఉద్యోగ సంఘాలు……
సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ జగిత్యాల జిల్లా చేర్మన్ భోగ శశిధర్, సెక్రెటరి జనరల్ గంగుల సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఈ రోజు అన్ని సంఘాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు నల్ల బ్యడ్జీలు ధరించి ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రీబుటరి పెన్షన్ విధానం అంతమయ్యే వరకు విశ్రమించకుండా పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవాలని సంకల్ప బలంతో జిల్లా కేంద్రం లోని మిని స్టేడియం నుండి తహసీల్ చౌరాస్తా వరకు నినాదాలు చేస్తు ర్యాలీ బయలుదేరి నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఎస్ ని రద్దుచేసి ఓపిఎస్ ని కొనసాగించాలంటూ ఉద్యోగులు గళమెత్తి గర్జించారు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని ఖండిస్తూ ప్రభుత్వ ఉద్యోగులందరూ సెప్టెంబర్ 1ని విద్రోహ దినం గా పాటిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టొ లొ పోందుపరచిన సందర్భంగా వెంటనే స్పందించి నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే వరకు ఉద్యోగ సంఘాల పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి, టీజివో జిల్లా కార్యదర్శి మామిడి రమేష్, ట్రెసా అధ్యక్షులు యం.డి.వకీల్, కృష్ణ, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు హరి అశోక్ కుమార్, PRTU అధ్యక్ష కార్యదర్షులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి, బోయినపల్లి ఆనందరావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రయ్య, ముజాహిద్ ఖాన్, CPSEU అధ్యక్ష కార్యదర్షులు గంగాధరి మహేష్, సర్వ సతీష్, గొల్లపెల్లి మహేష్ గౌడ్, మ్యాన పవన్ కుమార్, MPO సంఘం అధ్యక్షులు కందుకూరి రవిబాబు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్షి రవిందర్, JL సంఘం అధ్యక్షులు అత్తినేని శ్రీనివాస్, TPTF అధ్యక్ష కార్యదర్షులు బోగా రమేష్, కొక్కుల రాంచంద్రం, TRTF అధ్యక్ష కార్యదర్షులు తుంగూరి సురేష్, గుర్రం శ్రీనివాస్ గౌడ్. DTF అధ్యక్షులు నరేందర్,
STU అధ్యక్ష కార్యదర్షులు హరికిరణ్, మచ్చ శంకర్, BTF అధ్యక్షులు శంకర్ బాబు
TTU అధ్యక్షులు జితేందర్ రెడ్డి, నునావత్ రాజు, సంఘాల నాయకులు గణేష్, సాహెద్ బాబు, రవిందర్, రాజేందర్, రాజేశం, మధుకర్, ప్రమోద్, మహమూద్, సురేందర్, సోహెల్, శ్రావణి, ఇంద్రజ, సుమేరా పర్వీన్, డా.రాజేందర్ రెడ్డి, డా.సంతోష్, డా.శ్రీనివాస్, వరప్రసాద్, ఆనంద్, పూర్ణచందర్, ఆనంద్, రాజ్ కుమార్, నగేష్, బేగ్,ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS