నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్ పెనుబల్లి మండలం వంగ ముత్యాల బంజర, పెనుబల్లిలలో నిర్మిస్తున్న భవనాల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. వంగ ముత్యాల బంజరలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థల రికార్డులు తనిఖీ చేశారు. నీటి పారుదల శాఖకు దానం చేసిన పట్టాభూమిలో కొంత భాగాన్ని హెల్త్ సబ్ సెంటర్ కి కేటాయించినట్లు ఆయన అన్నారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన తెలిపారు. పెనుబల్లిలో నిర్మాణాన్ని పరిశీలించారు. త్వరలో పూర్తిచేసి అందుబాటులో తేవాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, పీఆర్ ఇఇ చంద్రమౌళి, పెనుబల్లి తహసీల్దార్ రమాదేవి, అధికారులు తదితరులు ఉన్నారు.