హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలి.
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
హెల్త్ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కల్లూరు లోని కప్పలబంధం, పుల్లయ్య బంజర రోడ్ లలో నిర్మాణంలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఒక్కో భవనం రూ. 20 లక్షల వ్యయ అంచనాలతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయిన పనుల వరకు ఎప్పటికప్పుడు ఎంబి రికార్డ్ చేసి మంజూరుకు పంపాలని, నిధులు వెంటనే మంజూరు అవుతాయని కలెక్టర్ తెలిపారు. రెండు నెలల్లో నిర్మాణాలు పూర్తయి, అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, పీఆర్ ఇఇ చంద్రమౌళి, ఎంపీడీఓ రవికుమార్, తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, అధికారులు, తదితరులు ఉన్నారు