జిల్లా కరీంనగర్.
సెంటర్ జమ్మికుంట.
నియోజకవర్గ స్థాయి వైద్యారోగ్య దినోత్సవ వేడుకలు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య అరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట లో
వైద్య శాఖ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరైయ్యారు. జమ్మికుంట లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి శంకర్ నoదన్ గార్డెన్స్ వరకు డప్పు చప్పుళ్ల నడుమ బతుకమ్మల తో వైద్య సిబ్బంది బారి ర్యాలీ నిర్వహించారు. వైద్యులు నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణి చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించారని తెలిపారు. రోగి ఏలాంటి పరిస్థిులో వున్న మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించే
కనిపించే దేవుళ్లు వైద్యులని చెప్పారు.
అనారోగ్య కారణంగా ఆసుపత్రికి రోగి వస్తే అన్ని పరీక్షలు చేసి వ్యాధి తగ్గేవరకు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రులు అంధకారంలో వుండేవని తెలంగాణ అవతరించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లేల్లుతున్నారని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్టు, అనేక పథకాలు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఎం పిపి లు, జడ్పీటిసిలు, సింగిల్ విండో చైర్మెన్ లు,జమ్మికుంట,హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, ఆర్డీఓ, తాసిల్దార్ లు, కౌన్సిలర్లు నాయకులు,వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బైట్
ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.