SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా

టిడిపి దీక్షలను దౌర్జన్యంగా భగ్నం చేసేందుకు కుట్ర..

టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం వద్ద టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడోరోజుకు చేరాయి. జగన్ రెడ్డి సైకో పాలన, ఎటువంటి ఆధారం లేకుండా చంద్రబాబుపై తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు ప్రజల్లోకి శాంతియుతంగా తీసుకు వెళుతున్నారు. వైసిపి అరాచక పాలన, అక్రమాలను ప్రశ్నిస్తుంటే జీవించుకోలేక శాంతియుతమైన దీక్షలపై కక్ష కట్టారు. ప్రజాస్వామ్యం హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ పోలీసులను మొహరింపజేసి దౌర్జన్యం గా దీక్షలను అడ్డుకునే కుట్ర దుర్మార్గం. అరాచక పాలన విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ టిడిపి శ్రేణులు ఉత్సాహాన్ని రెట్టింపు చేసి పోరాటం చేస్తున్న పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ను అడ్డుకునేందుకు కుట్ర పూనారు. శుక్రవారం ఏకకాలంలో వినుకొండ పోలీసులు జీవి ఆంజనేయులు ఇంటి వద్దకు, శివయ్య స్తూపం వద్ద దీక్ష శిబిరం వద్ద రెండు దలాలుగా చుట్టుముట్టారు. జీవి ఆంజనేయులు ఇంట్లో నిర్బంధించే ప్రయత్నం చేయగా ముందుగా పోలీస్ ఆగడాలను గ్రహించి ద్విచక్ర వాహనంపై దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు.


SAKSHITHA NEWS