కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం,ప్రతి అర్హత ఉన్న రైతుకు రుణమాఫి వర్తించేలా చూడటం మా బాధ్యత
సాక్షిత : మిల్లర్లు అడ్డగోలుగా కట్టింగ్ పేరుతో రైతులను దోచుకుంటున్నారని అప్పటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి రైతులు మొరపెట్టుకున్నా కనీసం దానిపై స్పందించలేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది,వాటిని వందశాతం అమలు చేస్తుంది..
పెగడపెల్లి మండల కేంద్రంలోనీ స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మండల స్థాయి వ్యవసాయ,రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ * పాల్గొన్నారు.. ఈ సందర్బంగా రైతు రుణమాఫీ విషయం పై అధికారులతో చర్చించి తగు సూచనలు చేశారు
అనంతరం మండలానికి చెందిన 20 మంది లబ్దిదారులకు 20 లక్షల రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ…
రైతు రుణమాఫీ పైన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,బి.ఆర్
ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు ఇచ్చిన ఏ మాటను అయినా నిలబెట్టుకున్నారా అని,రైతులకు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా అని,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందని, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ నాయకులు,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతుల నుండి మిల్లర్లు బస్తకు 5 కిలోలు తాలు తప్ప పేరుతో కట్టింగ్ చేస్తున్నారని స్వయంగా రైతులు వచ్చి మొరపెట్టుకున్నా కనీసం స్పందించలేదని,ఇట్టి రుణమాఫీకి సంబంధించి రైతుల వివరాలు కొన్ని సాంకేతిక లోపల వలన నమోదు కాలేదని,దాని వల్ల కొంత మంది రైతులకు రుణమాఫీ జరగలేదు,ఎవరికైతే రుణమాఫీ వర్తించలెదో వారి నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని,వాటిని కూడా త్వరలోనే పరిష్కరించి వారికి సాధ్యమైనంత త్వరగా రుణమాఫీ అయ్యేలా చూస్తామని,రైతులు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని,అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా చూస్తామని,ఒక ప్రజా ప్రతినిధిగా అది మా బాధ్యత అని,ఈ బి.ఆర్.ఎస్ నాయకుల మోసపూరిత మాటలను రైతులు ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని,ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.