SAKSHITHA NEWS

కుటుంబానికి చేయూత అభినందనీయం: సురేందర్

సాక్షిత సూర్యాపేటజిల్లాప్రతినిధి : తోటి ఉద్యోగులలో కలిసిమెలిసి అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ గత నెలలో ప్రమాదవశాత్తు మరణించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీను కుటుంబానికి 75 వేల రూపాయలు వారి కుమార్తెకు పోస్ట్ ఆఫీస్ ఫిక్స్ డిపాజిట్ చేయడం మరో బస్సు డ్రైవర్ వీరస్వామి కుటుంబానికి 36వేల రూపాయలు, ఆర్టీసీ కండక్టర్ ప్రకాష్ కుటుంబానికి 45 వేల రూపాయలు కార్మికులందరూ స్పందించి ఆర్థిక సహకారం అందించటం అభినందనీయమని సూర్యాపేట జిల్లా డిపో మేనేజర్ కే. సురేందర్ అన్నారు. సూర్యపేట డిపో లో కార్మికుల ఆర్థిక సహకారం ద్వారా వచ్చిన డబ్బులను బాధిత కుటుంబాలకు అందించి మాట్లాడారు. 40 రోజుల వ్యవధిలోనే ఇద్దరు కార్మికులు, ప్రమాదవశాత్తు మరణించారని కార్మికులకు వేతనాలు తక్కువగా ఉన్న గొప్ప మనసుతో కుటుంబ సభ్యుల వలె ఆర్థిక సహకారం 1,60,000/-(ముగ్గురికి) అందించడం గర్వకారణం అని అన్నారు.

ఎవరి అవసరాలు వారు తీర్చుకునేటువంటి ఈ సమాజంలో తమ వంతుగా ఈ సమాజానికి కొంత సహకరించి మానవతా విలువలతో ముందుకు పయనించడం గొప్ప ఆలోచన అని అన్నారు. కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ఈ సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వారు కోరారు. ఆర్టీసీ కార్మికులందరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ , ప్రయాణాలు చేసే సందర్భంలో హెల్మెట్ ని కచ్చితంగా ఉపయోగిస్తూ వాహనాలు నడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) బి. సైదులు, సీనియర్ అసిస్టెంట్ పుల్లయ్య, బత్తుల సుధాకర్, ఎస్.ఎస్.గౌడ్, అద్దె బస్సు ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, సెక్యూరిటీ కానిస్టేబుల్ హరీష్ , ఎస్.డి.ఐ ఘనీ, శ్రీకంట్లం, పవన్, జాన్ రెడ్డి, చారి, బి.యస్ రెడ్డి,భాస్కర్, డి సి నాయక్,యూసుఫ్, అయోధ్య,చక్రయ్య,యాదగిరి, ఎల్లయ్య,ప్రభాకర్ మెంచు వెంకన్న, అనిల్,శంకర్, మల్లయ్య, ఎలేంద్ర, వినోద్,అద్దె బస్సు ఓనర్లు, డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS