SAKSHITHA NEWS

అంగన్వాడి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్

సాక్షిత : మల్కాజిగిరి నియోజకవర్గం,ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని బి జె ఆర్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ సందర్శించి, అంగన్వాడీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థితో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందివ్వాలని అంగన్వాడీ టీచర్లు ఆదేశించారు. కార్యక్రమంలో అంగన్వాడి స్కూల్ టీచర్లు సంధ్యారాణి, పద్మజ, మంజుల, నాయకులు బాబు కిషోర్ మోసిన్ సలీం సయాద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS