SAKSHITHA NEWS

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి – ఎంపీపీ రమేష్ రాజు

పోషకాహార లోపాన్ని అధిగమించాలి — సీడిపివో శైలజ

వలిగొండ (సాక్షిత ప్రతినిధి)

గర్భిణులు బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోషణ పక్షం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండల కేంద్రం లోని రైతు వేదికలో
ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు తల్లులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ నూతి రమేష్ రాజు మాట్లాడుతూ బాలింతలు తల్లులు కిషోర్ బాలికలు చిరుధాన్యాలనీ తీసుకోవాలని వాటివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు చిరుధాన్యాల ద్వారా రక్తహీనతను నివారించుకోవచ్చని శరీరానికి తగిన పెరుగుదల వస్తుందని అన్నారు. ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయని అన్నారు. అంతేకాక మన పరిసరాలను మన చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. అనంతరం
ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి చాగంటి శైలజ మాట్లాడుతూ చిరుధాన్యాలు కొందాం తిందాం పండిద్దాం అనే నినాదంతో ఈ పోషణ పక్షం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ పోషణ పక్షం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
చిరుధాన్యాలతో కలిగే లాభాల గురించి ఆమె తల్లులు గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఒక సంవత్సరం కాలంలో 100% టీకాలు బరువు వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉన్న ఒక ఆరోగ్యవంతమైన బాబుతో వెల్ బేబీ షోను నిర్వహించి న్యూట్రి కిట్టు హైజనిక్ కిట్టును బహుమతిగా అందించారు.
ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలను వేదికపై ఉంచి ప్రతి ఒక్కొక్క ఆహారంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గణేష్, ఎంపీడీవో గీతారెడ్డి డాక్టర్ జ్యోతి, అగ్రికల్చర్ ఆఫీసర్ శోభ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు ధనమ్మ వాణిశ్రీ అంగన్వాడి టీచర్లు రాపోలు సునీత సౌజన్య మణెమ్మ సుస్మిత వసంత బాల విజయ కళమ్మ పుణ్యవతి నాగమణి ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS