SAKSHITHA NEWS

ఎమ్మెల్యే గైక్వాడ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

*సాక్షిత వనపర్తి :
ఏఐసీసీ నేత భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై వివాదాస్పంద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరియు బిజెపి నేత తన్వీందర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లాలోనికొత్తకోట పోలీస్ స్టేషన్ లో కొత్తకోట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేస్త్రి శ్రీనివాసులు, బీచు పల్లి యాదవ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పి ప్రశాంత్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రలోని విదర్భ జిల్లా బుల్దానా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ 11 లక్షలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు అదేవిధంగా బిజెపి నేత తన్వీవిందర్ సింగ్ రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తానని బహిరంగంగా మాట్లాడినందున ఈ ఇద్దరి రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.


“రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని అధికార కూటమి సభ్యులు హద్దులు దాటి అత్యంత అభ్యంతరకర మాటలతో అనుచిత వ్యాఖ్యల చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
రాహుల్ గాంధీ పై దాడి చేస్తామని బిజెపి నేతలు, శివసేన నేతలు హింసను ప్రోత్సహించేలా బహిరంగంగా బెదిరిస్తున్న ఇట్టి విషయంపై ప్రధాని మంత్రి గాని కేంద్ర హోం శాఖ మంత్రి గాని స్పందించకపోవడం దేశ ఔన్నతం దిగజార్చే చర్యనని
చట్టసభలలో ఉండే సభ్యులు ఎలా ప్రవర్తించాలో ఆ నేతలకు సూచించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎన్ జే బోయోజ్, పి కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు శేఖర్ రెడ్డి, సాయి రెడ్డి, మాసన్న, సురేందర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి పి మోహన్ రెడ్డి, బాలకొండయ్య యాదవ్, బీసీ సెల్ శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ నాయకులు దిలీప్ రెడ్డి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్, వల్గమాన్ శ్యామ్, ఎండి తయాబ్, లక్ష్మయ్య యాదవ్, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS