సాక్షిత : *నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పురోగతిపై నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
సాయంత్రం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి తో కలసి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి సామవాయి మార్గం ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ మార్గం ద్వారా వాహన చోదకులకు ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. అదే విధంగా అన్ని రోడ్లు కూడా సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంకా టి.డి.ఆర్. బాండ్లు ఇవ్వని వారికి వెంటనే ఇవ్వాలన్నారు.
ఈ సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖ, అదనపు కమిషనర్ సునీత, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, ఏ సి పి లు బాలసుబ్రమణ్యం, షన్ముగం, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, తదితులున్నారు.
మాస్టర్ ప్లాన్ రోడ్ల పురోగతిపై సమీక్షించిన కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్
Related Posts
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS
మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల
SAKSHITHA NEWS మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి SAKSHITHA NEWS