సాక్షిత తిరుపతి నగరం*:
తిరుపతి వేదికగా జరగనున్న విశ్వ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం ఏర్పాట్లను కార్యక్రమం కో ఆర్డినేటర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి శ్రీపధ్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 18వ తేది జరిగే విశ్వభారత సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర గవర్నర్ విచ్చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మన సంకల్పం అభివృద్ది చెందిన భారత్ అనే నినాదంతో నిర్వహిస్తున్న విశ్వ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం కోసం ఆడిటోరియంలో చేయాల్సిన ఏర్పాట్లపై కమిషనర్ తగు ఆదేశాలు జారీ చేసారు. తిరుపతిలో 18వ తేది జరుగు సభకు వచ్చే వారికి అవసరమైన సౌకర్యాలు అన్ని కల్పించాలని, కేంధ్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పథకాల వివరాల గురించి తెలియజేయు స్టాల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ…