తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ భాలాజీ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన వున్న గార్బేజ్ ట్రాన్స్‌పర్ స్టేషన్ను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తనీఖిలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత తనిఖిల్లో పాల్గొన్న మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డిలకు సూచనలు జారీ చేస్తూ నగరంలోని ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకునేటప్పుడే తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి, నగరంలో ఏర్పాటు చేసిన న్యూ భాలాజీ కాలనీ, వినాయకసాగర్ గార్బేజ్ ట్రాన్స్‌పర్ స్టేషన్లకు తరలించాలన్నారు.
గార్బేజ్ ట్రాన్స్‌పర్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఒక్క వాహనం వేయింగ్ మిషన్, సెన్సార్ ద్వారా ఎంత పరిమాణంలో చేత్త సేకరణ జరుగుతున్నదో తూకం వేయించి రికార్డ్ నమోదు చేయాలన్నారు. మరోసారి తడి పొడి చెత్తలను గార్బేజ్ ట్రాన్స్‌పర్ స్టేషన్ వద్దనే వేరు చేసి తూకివాకం వద్దనున్న రికవరీ ప్లాంట్స్ కి తరలించేందుకు తగు చర్యలు తీసుకునేలా ఓక సంపూర్ణ వ్యవస్థను నిర్వహించాలన్నారు. గార్బేజ్ సెంటర్ ఆపరేటర్లతో మాట్లాడి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తూ, గార్బేజ్ ట్రాన్స్‌పర్ స్టేషన్లలోని పరికరాలు అన్ని కండీషన్లో వుండేలా నిత్యం పరిశీలించాలని, మరమ్మత్తులు వున్నవాటికి తక్షణమే రిపేరు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరి సూపర్ వైజర్ చెంచెయ్య, మేస్త్రీలు పురుషోత్తం, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.