SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ లో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి కాలనీల లోని పలు సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .


సాక్షిత : ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా జిహెచ్ఎంసి మరియు సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ను చేపట్టడం జరిగినది అని, కాలనీ లలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించడానికి అధికారులతో కలిసి కాలనీ లలో పర్యటించి సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరుగుతుంది అని, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, కాలనీ ప్రతినిధులు,రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘ సేవకులు ప్రతి ఒక్కరు కాలనీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, అధికారులు ఎలక్ట్రికల్ ఏఈ హరి సింగ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ ముస్తఫ్ఫా, హార్టికల్చర్ దాసు, డ్రైనేజ్ సూపర్వైజర్ నరేందర్, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ కుమార్, లైన్ మెన్ కాళి, ఎస్ఎఫ్ఏ శ్రీకాంత్, మరియు కాలనీ వాసులు నక్క శ్రీను, వెంకటయ్య యాదవ్, సత్యనారాయణ, నాగార్జున రెడ్డి, కిషన్ రావు, చాట్ల రవి, చంద్రయ్య, రాఘవేందర్ రెడ్డి, రాజి రెడ్డి, బ్రమ్మయ్య, అంజి రెడ్డి, పేరయ్య, సురేష్, రవీందర్, బస్వా రాజ్, నరసింహ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, సుదర్శన్ రావు, కృష్ణ రెడ్డి, నాయుడు, పెంటయ్య, నాగేశ్వర రావు, సత్తయ్య, శివ, హాబీబ్, శ్రీశైలం, లక్ష్మణ్, మహేశ్వర్ రెడ్డి, బాలకృష్ణ, మహిళలు విమల, స్వప్న, దుర్గ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS