వాల్మీకుల ST పునరుద్దరనపై సీఎం ఏదో ఒకటి బనగానపల్లెకు వచ్చే ముందు తేల్చాలి…… MVRPS రాష్ట్ర అధ్యక్షులు బోయపులికొండన్న

Sakshitha news

వాల్మీకుల ST పునరుద్దరనపై సీఎం ఏదో ఒకటి బనగానపల్లెకు వచ్చే ముందు తేల్చాలి…… MVRPS రాష్ట్ర అధ్యక్షులు బోయపులికొండన్న

ఎన్నికల ముందు వాల్మీకులను ST లుగా పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి అధికారంలోకి వచ్చి 2సంవత్సరాలయినా సీఎం నోరు మెదపటంలేదని, కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి వాల్మీకుల ST పునరుద్దరనపై గత తీర్మానంలో సవరణలు చేసి పంపమని ఉత్తరం రాసినా ప్రభుత్వం ఆవైపు ఆలోచన చెయ్యకపోవటం వాల్మీకులను వంచించటమేనని, త్వరలో బనగానపల్లె వస్తున్న ముఖ్యమంత్రి ముందుగానే వాల్మీకుల విషయంపై స్పష్టం చెయ్యాలని అలా ప్రకటన చెయ్యకుండా మొండిగా వ్యవహారిస్తే వాల్మీకులు కూడా తగిన సమయంలో, తగినవిధంగానే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని 67ఏళ్లుగా పాలకుల ఇదే మోసపు మాటలతో విసుగెత్తి పోయారని, ఇక అపరిస్థితి రానివ్వమని నంద్యాల లోని దేవనగర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అయన వాస్తవ పరిస్థితిని వివరించారు.ఈ సమావేశంలో సుంకన్న, సాయి, పెద్దక్క, నాగేష్, రమేష్, వాసు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top