విద్యార్థుల భవిష్యత్తు : చదువుల పట్ల ఆసక్తి పెంపొందించాలి : ఎమ్మెల్యే జారె
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్యార్థుల చదువుల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు భవిష్యత్తు పట్ల స్పష్టమైన దిశా నిర్దేశం చూపించేందుకు ‘ఇన్స్పైర్, ఇగ్నైట్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం కోసం హైదరాబాదు నుండి ప్రత్యేకమైన మోటివేషన్ స్పీకర్లను ఆహ్వానించి అశ్వారావుపేట ముస్లిం మైనారిటీ బాలికల పాఠశాల, ఏజీహెచ్ఎస్ బాలికల పాఠశాల, మద్దికొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇన్స్పైర్ మైండ్స్ – ఇగ్నైటింగ్ సోల్స్ సభ్యులు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, లక్ష్యసాధన భవిష్యత్తు ప్రణాళిక, వంటి అంశాలపై చక్కని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి సహకారం అందించిన సంస్థ వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పీవో బి. రాహుల్, మోటివేషన్ స్పీకర్స్ జైపాల్, రంజిత్, సుధాకర్, రామ్, శ్రవణ్, అయ్యప్ప, సురేంద్ర, నవీన్, ఖాసీం, మండల విద్యాశాఖ అధికారి ప్రసాద్ రావు, స్థానిక అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాల వరకే పరిమితం కాకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను, అధిరోహించేందుకు మనసులో అగ్ని వెలిగించాలనే, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు.
