దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్

Sakshitha news

దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మున్సిపల్ బీజేపీ శ్రేణులు
తెలంగాణ బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ 42% కోటాలో 10% ముస్లింలను చేర్చడాన్ని వెతిరేకిస్తూ బీజేపీ దర్నా

కేంద్రం లో నరేంద్ర మోడీగారి సారద్యంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగభద్ధమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా బీసీ కోటాకు గండి కోట్టి ముస్లింలకు పంచడం అన్యాయం అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ వర్గాలైన ముదిరాజ్,గంగపుత్ర, మున్నూరు కాపు, విశ్వకర్మ,నాయి, రజక,పద్మశాలిలకు ఇచ్చిన హామీలు ఏమయినాయి అని నిలదీసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావ్ దీన్ని వెంటనే విరమించుకోక పోతే రేవంత్ సర్కార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది హేచ్చరిక చేయడం జరిగింది
ఈ కార్యక్రమం లో దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేశ్వర్ చారి , మున్సిపల్ ప్రధాన కార్యదర్శి తురాయి భాను గౌడ్, సీనియర్ నాయకులు దమ్మగారి ప్రభాకర్ రెడ్డి, యువమోర్చ నాయకులు మేడ్చలం అతీష్ బాబు, అల్లూరి విష్ణు, గణేష్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు